Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖమ్మంలో ఇసుక మాఫియా..! ఆంధ్ర ముఠాతో చేతులు కలిపి…

పోలీస్ తనిఖీలలో పట్టుబడ్డ లారీ డ్రైవర్లు, యాజమానులపై కేసులు..

క్రైమ్ నెం. 21 & 22/ 2024 / U/s 420, r/w 511 IPC, sec 192 of MV act. బోనకల్లు పి.ఎస్

ఖమ్మం జిల్లా మధిర, బోనకల్లు క్రాస్ రోడ్డులో నెంబర్ ప్లేట్ లేని మూడు లారీలు సిజ్..

పోలీస్ తనిఖీలలో పట్టుబడ్డ లారీ డ్రైవర్లు, యాజమానులపై కేసులు..

అక్రమ రవాణా చేసేందుకు ఇసుక లోడు కోసం వెళ్తున్న లారీలు..
వైరా ఏసీపీ రహెమాన్ బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్
రాత్రివేళలో ఆంధ్రా ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ఖమ్మం జిల్లా మధిర ,

బోనకల్లు క్రాస్ రోడ్డులో నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న మూడు లారీలను సిజ్ చేసి యాజమానులపై, డ్రైవర్లపై బోనకల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చేసినట్లు వైరా ఏసీపీ రహెమాన్ తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దు పోలీస్ స్టేషన్ల యస్.హెచ్ వో లను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.

అందులో భాగంగా గత కొంతకాలంగా ఖమ్మంలోని ఇసుక మాఫియా ఆంధ్ర ముఠాతో చేతులు కలిపి ఆంద్రప్రదేశ్ ఇసుక క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బోనకల్లు మండలం మీదుగా రాకపోకలు సాగిస్తూ..ఇది ఆంధ్ర ఇసుక అంటూ అధిక ధరలకు అమ్ముకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నేపథ్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

అందులో భాగంగా ఎటువంటి అనుమతులు బిల్లులు లేకుండా నందిగామ రీచ్ నుంచి ఖమ్మం కేంద్రానికి లారీలో ఇసుకను తరలించేందుకు నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న మూడు లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. ఇసుక తరలింపు క్రమంలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తప్పించుకునేందుకు, సీసీ కెమెరాలకు, పోలీసు చలాన్ కు దొరకకుండా వుండేందుకు లారీ యాజమానుల సూచనల మేరకు నెంబర్ ప్లేట్ తొలగించినట్లు నిందుతులు వెల్లడించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,

ఇసుక రవాణా చేస్తున్న లారీలపై నజర్‌ పెట్టామని అన్నారు.నిందితులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక మాఫియాను కట్టడి చేస్తామని పేర్కొన్నారు.

*నిందుతులు…*
1) బండి కొండలరావు, టేకులపల్లి, ఖమ్మం. (AP05 TD 4459, TS07 UF 3333 లారీల యజమాని)
2) చెలమల్ల సుమంత్ కుమార్, రోటరీనగర్ , ఖమ్మం. (TS 04 UD 8388 లారీ ఓనర్)
3) యార్ర మహేందర్ ,పెరుమళ్ల సంకీసా, డోర్నకల్ మండలం , మాహబుబాబాద్ జిల్లా
4) యార్ర సతీష్ పెరుమళ్ల సంకీసా, డోర్నకల్ మండలం , మాహబుబాబాద్ జిల్లా
5) ఇరుగు సుదర్శన్, ఈశ్వర మాధరం, కూసుమంచి మండలం , ఖమ్మం జిల్లా.