Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చోద్యం చూస్తున్న పోలీసులు….రెక్కలు చాచిన ఇసుక మాఫియా

రెక్కలు చాచిన ఇసుక మాఫియా

 

ప్రకృతి సంపదకు తూట్లు

రామన్నపేట

కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకొని అక్రమ ఇసుక దందా భావితరాల భూగర్భ జలాలకు ప్రమాదం వాటిల్లుతుందని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు సమాధానం చెప్తున్నారు.

చోద్యం చూస్తున్న పోలీస్ యంత్రాంగం. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇసుక మాఫియా మండలం పరిధిలోని శోభనాద్రిపురం గ్రామంలో

కొంతమంది వ్యక్తులు తమ ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక దందకు అలవాటు పడి పచ్చని సెలయేరు మధ్య ఉన్న ప్రకృతి సంపదకు తూట్లు పొడుస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అంతు పొంతు లేని సమాధానంతో మా ఎనకాల కొంతమంది

ప్రజాప్రతినిధులు ఉన్నారని ఏమి చేసుకుంటారో చేసుకోమని పెట్రేగిపోతూ సమాధానం చెబుతున్నారు.

అక్రమ ఇసుక తరలించడం వల్ల భావితరాలకు భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని జర్నలిస్టులు అడ్డుకుంటే మాఫియాకు సహకరిస్తున్న కొంతమంది ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పోలీస్ నిఘా వ్యవస్థ బాధ్యతగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పచ్చని పల్లెల్లో సాగుతున్న ఇసుక అక్రమ దందకు అడ్డుకట్ట వేయాలని పలువురు ఆరోపిస్తున్నారు.