Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జాన్ పహాడ్ దర్గాపై నిజమైన హక్కు దారులమైన మాపై తీవ్ర వివక్ష…

  • వక్ఫ్ బోర్డు కాంట్రాక్టును నిలిపివేసేలా కోర్టు ఆర్డర్ .
  • కోర్టు తీర్పును గౌరవించకుండ దర్గాలో మీకు పని లేదంటున్న వక్ఫ్ బోర్డు అధికారులు.
  • జాన్ పహడ్ దర్గా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులు, ముజావర్.

సూర్యాపేటజిల్లా31(నిజం చెపుతాం న్యూస్):
400 సంవత్సరాలుగా జాన్ పహాడ్ దర్గాకు మా తాత ముత్తాతలు సాంప్రదాయ బద్దంగా ముతా వలీలుగా వ్యవహరించారని 1989 లో వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకున్న తర్వాత తమను దర్గాలోకి రానివ్వడం లేదని ఈ విషయమై తాము కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చినప్పటికి మాకు వక్ఫ్ బోర్డు అధికారులు ముతావళిలుగా హక్కులు కల్పించడం లేదని జాన్ పహాడ్ దర్గా హక్కుదారులు హైమద్ హుస్సేన్, గులాం రసూల్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అధికారులు, ముజావరులుగా చెప్పుకుంటున్న వారు దర్గా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. దర్గాలో తాయత్తులో కట్టడం దట్టిల్లు కట్టడం, కందూరులు చేస్తే డబ్బులు వసూలు చేయడం చేస్తు భక్తులను నిలువునా దోచుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పేకాట ఆడుతూ పట్టుబడి దర్గా ప్రతిష్టతకు భంగం కలిగించారని అన్నారు. కోర్టు తమన హక్కులు దారులుగా గుర్తించాలని తీర్పు ఇచ్చినప్పటికీ మాకు హక్కులు ఇవ్వకుండా కనీసం దర్గాలో సైదన్నను దర్శించుకునే అదృష్టం కూడా కల్పించడం లేదన్నారు. దర్గాలో మీతో పనిలేదని ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమని చెబితే తాము కోర్టుకు వెళ్ళామని కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు దర్గాకు రానివ్వడం లేదన్నారు. అలాగే ఇటీవల దర్గాలో నిర్వహించే వివిధ రకాల వసూళ్లకు టెండర్లు పిలవడం జరిగిందని తాము ఆ టెండర్లనుపిలవడంపై కోర్టుకు వెళ్లామని కోర్టు టెండర్లను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు టెండర్లు ఖరారు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని మా పూర్వీకుల నుంచి దర్గాలో హక్కుదారులుగా ఉన్న మమ్మల్ని నిజమైన హక్కుదారులుగా గుర్తించాలని కోరారు. జాన్ పహాడ్ దర్గా వద్ద వక్ఫ్ బోర్డు కాంట్రాక్ట్ ను నిలిపివేయమని కోర్టును ఆశ్రయిస్తే నిలిపివేయమని స్టే ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో జానపహడ్ దర్గా నిజమైన హక్కుదారుల మహమ్మద్ హన్నన్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ సాలార్ తదితరులు ఉన్నారు.