కరోనా నిర్ములనకు అవగాహన సదస్సు

మండల పరిది లోని పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లోని ఫైర్ కాలనీ లోని ఎంపిఏం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కరోనా అవగాహన సదస్సు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ కరోనా రెండవ దశ మొదలైనది అని ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మూడు సూత్రాలు తప్పక పాటించాలి అన్నారు.
1) మాస్క్ తప్పనిసరి గా వాడాలి 2)సానిటైజర్ చేసుకోవాలి 3)భౌతిక దూరం పాటించాలి. అని సూచించారు. అనంతరం సర్పంచ్ సుమతి అద్వర్యం లో వీధి లైట్స్ వేయించి, వీధుల్లో శానిటేసన్ చేయించటం జరిగింది ఈ కార్యక్రమంలో సీసీ మరియు వివో అధ్యక్షులు విజయలక్ష్మి, గ్రామ దీపికలు, వైస్ సర్పంచ్, సెక్రెటరీ, వార్డ్ మెంబెర్స్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.