Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ భూములను ఆక్రమించి మైనింగ్ నిర్వహణ…??

లక్డారం గ్రామ క్రషర్ల సర్వేలలో పలు ఆక్రమణలు వెలుగు చూసినట్లు అనుమానాలు…!

 

పటాన్ చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధి లక్డారం గ్రామ క్రషర్ల వద్ద రెండవ రోజు సర్వే కొనసాగింది.అయితే ఈ సర్వేలలో పలు ఆక్రమణలు వెలుగు చూసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొన్ని క్రషర్ల యాజమాన్యాలు అనుమతులకు మించి భారీ ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించి మైనింగ్ నిర్వహించినట్లు అనుమానాలు వెలబడుతున్నాయి.

పది రోజులపాటు కొనసాగే ఈ సర్వేలలో పటాన్ చెరు, అమీన్పూర్,జిన్నారం, కంది మండలాల ఆర్.ఐ లు,సర్వేయర్లు,మైనింగ్ శాఖకు చెందిన అధికారులు పాల్గొని ముమ్మరంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ మొత్తం 37 క్రషర్ల ఉండగా అందులో రెండు క్రషర్లు రుద్రారం గ్రామ పరిధిలో ఉన్నాయి.సర్వే కోలత యంత్రాలు ఒకటే ఉండటంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

దీంతో వారం రోజులపాటు జరగాల్సిన సర్వేలు 12 రోజులపాటు ఈ సర్వేలు జరగనున్నట్లు తెలుస్తుంది.ఈ సర్వే వల్ల కొందరు క్రషర్ల యాజమాన్యాలకు భారీ ఎత్తున జరిమానాలు విధించే అవకాశాలు కనిపిస్తున్నట్లు వినికిడి.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో లక్డారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సర్వేలు సంపూర్ణంగా నిర్వహించి ఆక్రమణలకు పాల్పడ్డా క్రషర్ల యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బుధవారం నిర్వహించిన సర్వేలో మైనింగ్ ఏ డి మధుకర్, మైనింగ్ సర్వేయర్ శైలజ, పటాన్ చెరు తాసిల్దార్ భాస్కర్,నాలుగు మండలాల సర్వేయర్లు, ఆర్.ఐ లు పాల్గొన్నారు.