Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలోని మహబూబాబాద్ పార్లమెంట్ లో రసవతమైన పోరు

మహబూబాబాద్ పార్లమెంట్ కు కాంగ్రెస్ నుండి తొమ్మిదిమంది పోటీకి సిద్ధమైనఆశావహులు?.

మహబూబాబాద్ జిల్లా

తెలంగాణలోని మహబూబాబాద్ పార్లమెంట్ లో రసవతమైన పోరు.

కాంగ్రెస్ లోక్ సభ లో పోటీకి అభ్యర్థులు ఫిక్స్…?

మహబూబాబాద్ పార్లిమెంట్ నుండి 9 మంది లో సీటు ఎవరికి దక్కేను?

మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్.?

కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత*డాక్టర్ బెల్లయ్య నాయక్.?.

డాక్టర్ శంకర్ నాయక్ .? భద్రాచలం కొత్తగూడెం నుండి,

పోలీస్ ఆఫీసర్ డుంగ్రోత్ నాగరాజు.?

పోలీస్ ఆఫీసర్ సిఐ బానోత్ కాశిరాం.?

ప్రముఖ వ్యాపారవేత్త మలోత్ నెహ్రు నాయక్ ? కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్.?

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరురాలు గా ఉన్న బానోతు విజయ బాయి.?

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు సతీమణి అయిన, ప్రమీల.?

వీరితో పాటు మరి కొంత మంది ఆశావహులు.రానున్న లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా, అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం.వీరిలో మహబూబాబాద్ పార్లమెంట్ నుండి టికెట్ ఎవరికి దక్కేను.

వీరిలో మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, ప్రముఖ వ్యాపారవేత్త మాలోతు నెహ్రూ నాయక్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులకు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కి తాము పోటీ చేయడానికి సిద్ధమని తమకే పార్టీ టికెట్ కేటాయించాలని విజ్ఞాపన పత్రాన్ని అందించటం కూడా జరిగింది.

ఈ తొమ్మిది మంది ఆశావహులలో ఎవరికి టికెట్ వస్తుందో, పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియాలి, ఈ పరిస్థితి ఇలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మానుకోట అసెంబ్లీ టికెట్ ఆశించడం, పార్టీ అధిష్టానం

ప్రజాభిప్రాయం మేరకు డాక్టర్ మురళి నాయక్ టికెట్ కేటాయించడం అసెంబ్లీ ఎన్నికలలో డాక్టర్ మురళి నాయక్ అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయకు ను ఓడించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అసెంబ్లీ టికెట్టు రానందున వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీకే టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడం జరిగింది అని విశ్వసనీయ వర్గాల వినికిడి. పోతే టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుతం ఎంపిక ఉన్న మాలోతు కవిత రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నేనే పోటీ చేస్తానని వారు ప్రకటించడం కూడా జరిగింది.

ఎన్నికల షెడ్యూల్ వెలబడే నాటికి కాంగ్రెస్ పార్టీలో కానీ బి.ఆర్.ఎస్ పార్టీ లోనే కానీ, బిజెపి పార్టీ నుండి, ఇంకా ఇతర పార్టీల నుండి మహబూబాబాద్ పార్లమెంట్ కు ఎందరు పోటీ చేయనున్నారు అనే విషయం

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే కానీ తెలియదని ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా ఉంటాయని మాత్రం తెలుస్తుంది.