Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సదరం పత్రాలకు స్లాట్ బుకింగ్.

సదరం పత్రాలకు స్లాట్ బుకింగ్.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య.
మహబూబాబాద్, జిల్లా
సదరం ధ్రువీకరణ పత్రాలకు అర్హులైన వారు స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారము స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షలను సదరం క్యాంపు ల ద్వారా నిర్వహించడం జరుగుతుందని,

అర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకుగాను మీసేవ కేంద్రాలకు వెళ్లి నిర్ణయించిన ఫిబ్రవరి 7, 28 తేదీలలో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.
కొత్తగా సదరం సర్టిఫికెట్ కావలసినవారు ముందుగా ఆయా మండలాల పరిధిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లచే వైకల్య నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

కొత్తగా సదరం ధ్రువీకరణ పత్రాలు పొందేవారు ఏడవ తేదీన 150 మంది 28వ తేదీన మరో 150 మంది స్లాట్ బుకింగ్చేసుకోవాలన్నారు.సదరం సర్టిఫికెట్ కాలపరిమితి ముగిసిన వారు 150 మంది ఫిబ్రవరి 14వ తేదీన తిరిగి రెన్యువల్ చేసుకోవాలన్నారు.
స్లాట్ బుకింగ్ కొరకు మీసేవ సెంటర్లో చార్జి క్రింద 35 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు.300 కొత్తవి 150 రెన్యువల్ తో కలిపి మొత్తంగా 450 స్లాట్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగాను మీసేవ కేంద్రాలలో స్లాట్ బుకింగ్ మొదలవుతున్నందున అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.