Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ గట్టునుంటావా..కోరం?? ఆ గట్టునుంటావా.. కోరం ??

కోరం నీ పయణం ఎటు??

ఈ గట్టునుంటావా..కోరం??

ఆ గట్టునుంటావా.. కోరం ??

ఏ గట్టున లేకుంటే నీ పని మండలంలో ఘోరం ఘోరం ..?

నిజం చేపుతాం ప్రతినిధి/ ఇల్లందు.

బయ్యారం మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆదిపత్య బల నిరూపన షోలు…!

కిమ్మనకుండా ఉంటున్న ఇల్లందు నియోజకవర్గం ఎమ్మేల్యే..!

ఎవరి పక్షాన కోరం కనకయ్య..!

మండలంలో చర్చనీయాంశం…!

గ్రూపులకు చెక్ పెట్టేది…ఉందా..లేదా..?

మండలంలో గ్రూపు రాజకీయాలతో జనం బేజారు ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకుల పోరు ఎమ్మెల్యే కు కత్తిమీద సాములా మారింది.గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ అప్పటి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై సొంత పార్టీలోనే ఉంటూ

ఆమెపై అసమ్మతి గళం వినిపించారు. అనంతరం రాజకీయ పరిణామాల దృష్ట్యా కోరం కనకయ్య మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచర గణంతో బిఆర్ఎస్ పార్టి వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . అనతి కాలంలోనే పొంగులేటి తన వర్గీలకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకొని సక్సెస్ అయ్యారు .

అందులో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గతంలో వారి వెంట పనిచేసిన బిఆర్ఎస్ క్యాడర్ కనకయ్యను అంటిపెట్టుకొని పనిచేశారు. మరి కొంతమంది ఎన్నికల ముందు మండలంలో కాంగ్రెస్ లో చేరకుండానే పరోక్షంగా సహకరిస్తూ ఎన్నికల రాజకీయ విశ్లేషణ అవపోసనం చేసుకునేందుకు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మండలంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారిదే అధికార పార్టి పెత్తనం అయింది. మళ్ళీ ఇప్పుడు కనకయ్య అనుచర గణంతో కాంగ్రెస్ లోకి లేటుగా వచ్చినా మాదే పెత్తనం కావాలంటూ మండలంలోగ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నట్లు స్వంత పార్టీలోన విమర్శలు ఉన్నాయి ,

ఎవరికి వారే గతంలో పనిచేసిన వారు నూతనంగా వచ్చిన వారి మధ్య ఎన్నికల అనంతరం బేధాభిప్రాయాలు నెలకొన్నాయి .ఎవరికి వారే కనకయ్య ఆశీస్సులు మాకే అంటే, మాకే అని ,ప్రగల్బాలు పలుకుతూ తమ పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు .

ఎమ్మేల్యే మేడారం దేవుడి మొక్కులలో ఆదిపత్యం కోసం ఆరాటం

. ఈ మధ్యకాలంలో కనకయ్య దంపతులు మేడారం జాతర కు వెళ్లి నప్పుడు వారి ముఖ్య అనుచరులు,పార్టీ నాయకులు పోటీలు పడి గ్రూపులుగా మేడారం చేరుకొని సోషల్ మీడియా లో ఎమ్మేల్యే కోరం కనకయ్య అనుచరలమంటూ ఫోటోలు పెట్టారు.

మండల అబివృద్ది అంటూ ఎవరికి వారే మంత్రులను కలుస్తూ ప్రచారం

మేడారం సంఘటన మరువక ముందే ఈ నెల 29 న ఎమ్మెల్యేతో కలిసి కొండా సురేఖను కలిసి మండల అభివృద్ధి పనులకు సహకరించాలని కొంతమంది నాయకులు వినతి పత్రాలు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం జరిగింది

గతంలో ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేసిన వారిని ఎమ్మేల్యే మరచి,మాకు తెలియకుండా వారిని వెంటబెట్టుకొని హైదరాబాదులో మంత్రులను కలవడం ఏమిటని గుస గసలాడుతూ ,

ఈ వ్యవహారం పై పార్టీ పాత నాయకులు రహస్యప్రదేశంలో సమావేశం జరిపినట్లు సమాచరం . ఎమ్మెల్యే గెలుపుకోసం కష్టపడి పార్టి కోసం పని చేసిన మండల నాయకులు కోపంగా ఉన్నట్లు సమాచారం,

పార్టీ మెప్పునా.. పాత క్యాడరా ..!

ఎమ్మేల్యే మెప్పు కోసం ఎవరికి వారే బల ప్రదర్శన కోసం మంగళవారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఎమ్మేల్యే కోరం ను వెంట బెట్టుకుని మండల అభివృద్ధి పేరిట, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ,మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడిని భారత్ చంద్రారెడ్డి ని,కలిసి వినతులు ఇవ్వడం ,

ముఖ్య నాయకులను కలవడం సోషల్ మీడియాలో వారి అనుచర గణం నాయకులు సోషల్ మీడియా లో హల్చల్ చేయడం తో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
మండల కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు చెక్ పడనుందా..! లేదా..!

మండలంలో కాంగ్రెస్ నాయకులకు ఒక్క ప్రజా ప్రతినిధి పార్టీ లో మూడు వర్గాలు అన్నట్లుగా వ్యవహార శైలి నెలకొంది .దీనిని ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక శ్రద్ధ వహించి, గ్రూపు రాజకీయాలు లేకుండా,మండల నాయకులను ఒక్కతాటిపై నిలబెడతారో లేదో వేచి చూడాలి .ఎమ్మెల్యే మదిలో పాత కాంగ్రెస్ నాయకులను చూసి చూడనట్లు నటిస్తారో …లేక బిఆర్ఎస్ పార్టీ నుండి తమ వెంట వచ్చిన వారిని పక్కన పెట్టుకుంటారో వేచి చూడాలి మరీ.. కాలమే సమాదానం చెప్పాలి.