Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అనుమతి లేకుండా గోదావరి ఇసుక అమ్మకాలు

బయ్యారంలో అనుమతి లేకుండా గోదావరి ఇసుక అమ్మకాలు ..

యదేచ్చగా గోదావరి ఇసుక అక్రమ , విక్రయాలు ..

చూసి చూడనట్లు పలు శాఖల అధికారులు..

చర్యలు తీసుకునే అధికారులు మౌనమేలా..!

నిజం చేపుతం/ఇల్లందు – బయ్యారం:

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలంలో కొందరు అక్రమంగా లారీల ద్వారా ఇసుకను జీరో వ్యాపారం పై డంపులుగా నిల్వచేసుకుంటూ అధిక రేట్లకు బోర్డులు పెట్టి జోరుగా విక్రయాలకు పాపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సక్రమ మార్గంలో కాకుండా తమ పలుకుబడితో ఇసుక రీచ్ ల వద్ద, మీ సేవా చెలాన్ లు ఏమి లేకుండా అధిక టన్నేజిలతో లారీలలో సుమారుగా 50 నుండి 60 టన్నులు మండల కేంద్రంలోకి రవాణా జరుగుతుండటంతో ప్రధాన రహదారులు గుంతల మయంగా ఏర్పడి నిత్యాం ప్రయాణించే వాహన దారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబదిత అధికారులు పట్టి పట్టన్నట్లు స్తానికులు చర్చించుకుంటున్నారు
అక్రమ డంపులు వద్ద ఇసుక అమ్మకాలు బోర్డులు పెట్టి
మండలంలో ఇల్లందు– మహబూబాబాద్ ప్రధాన రహదారి పక్కనే లారీ ఆఫీసు వద్ద,స్టేషన్ గుండ్రాతి మడుగు వెళ్లే ప్రధాన రహదారి , శిధిలమైన పెంకు ఫ్యాక్టరీ ఆవరణలో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకొని కొందరు బహిరంగంగానే గోదావరి ఇసుక అమ్మబడును

అంటూ బోర్డులు ఏర్పాటు చేసుకొని నిత్యం ట్రాక్టర్ల ద్వారా మండలంలో పలు గ్రామాలకు విక్రయాలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం .


అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ విక్రయాలు
కంచే చేసు మేసింది అనేచందంగా మండలంలో అక్రమ ఇసుక వ్యాపారులకు కొంత మంది అధికారులు వంత పాడుతూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి .

ట్రిప్పు ట్రాక్టర్ ఇసుక 5 నుండి ఆరు వేల రూపాయలకు అమ్మకాలు నిత్యం సాగిస్తున్నారని సమాచారం.

అక్రమ ఇసుకను అరికట్టడానికి ( ట్రాన్స్ పోర్టు ఆర్టిఓ, గ్రౌండు వాటర్ , ఇరిగేషన్, ఆర్ డబ్ల్యు ఎస్ , సబ్డివిజనల్ పోలీసు ఆఫీసర్, మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్) జిల్లాలో మూడు నాలుగు శాఖల అధికారులకు ప్రభుత్వం జిఓ నెం 3 లో స్పష్టంగా పొందు పర్చినా… మాకేందుకు లే అని కొందరు వాటిని చూసినా ..పట్టించుకోవడం లేదనే ..ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఇప్పటికైనా అక్రమ ఇసుక డంపులను గుర్తించి వాటిని సీజ్ చేయాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు.