Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆయిల్ ఫామ్ పంట తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు

  • ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య

(మహేశ్వరం) రైతులుఆయిల్ ఫామ్ పంటలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను గడించవచ్చునని ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య తెలిపారు. మంగళవారం నాగారం రైతు వేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం పామాయిల్ వేసుకునే రైతులకు మొక్కలకు 90% రాయితీ కల్పించబడుతుందని అన్నారు. డ్రిప్పుకు ఎస్సీ ఎస్టీలకు 100 శాతం, ఓసి, బీసీలకు 80 నుండి 90 శాతం శాతం వరకు రాయితీలు ఇవ్వబడుతుందని అన్నారు. రైతులకు నాలుగు సంవత్సరాల వరకు రూపాయలు 4200 మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఇవ్వని ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాకు వాలివ్ ఆయిల్ కంపెనీ రైతులకు మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు చెల్లించి కొనుగోలు చేస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం ఎంపీటీసీ కుండే వెంకటేష్, వాల్యూఆయిల్ కంపెనీ మేనేజర్ ప్రమోద్ కుమార్, ఏ ఈ దీన రైతులు పాల్గొన్నారు.