Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బోధన్ లో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ బోధన్ : బోధన్ పట్టణంలో పలువురు యువకులు కత్తులతో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. యువకుల మధ్య చిన్న పాటి గొడవ చోటు చేసుకుంది. చిన్నపాటి గొడవ మాట మాట పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకు గొడవ పెద్దదయింది. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని జిల్లా ఆసుపత్రికి, మరొకరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ సిఐ వీరయ్య తెలిపారు.