Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వాలు మారినా? ఆర్టీసీ డిపో మేనేజర్లు మారినా? ఆర్టీసీ అధికారుల పనితీరు మారలేదు

బస్టాండ్ కి రాని బస్సులు, రోడ్లపైన ప్రయాణికుల అవస్థలు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రమే టెంట్లతో కళకళ, శిధిలా దశకు చేరిన బస్టాండ్ కి తుదిమెరుగులు

ప్రభుత్వాలు మారినా? ఆర్టీసీ డిపో మేనేజర్లు మారినా? ఆర్టీసీ అధికారుల పనితీరు మారలేదు


గూడూరు మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ బస్టాండ్, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ తెలుగు గ్రామీణ కాంతి పథం క్రింద, గ్రామ ప్రజల సహకారంతో, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గూడూరు బస్టాండును, 1989వ సంవత్సరం మార్చి నెల 11 వ తారీఖున నిర్మించబడిన బస్టాండు ఆనాటి రోజుల్లో ఒక వెలుగు వెలిగింది. ప్రయాణికులకు, అలసట చెందిన బాటసారులుకు సేద తీర్చుకునే దేవాలయంలా!

ఈ ఊరి నుండి వేరే ప్రాంతాలకు, నగరాలకు, పట్టణాలకు తీసుకుపోయే బస్సులు, ప్రతి అరగంట కు ఒకటి చొప్పున, రహదారుల వెంట సాగిపోతుంటే రద్దీగా, జన సందోహంతో కితకిటలాడిన ఆనాటి బస్టాండు! నిర్మానుష్యంగా మారిన తీరు? నేడు నడుస్తున్న బస్సు సర్వీసులకు టైమ్ అంటూ ఏది లేకుండా, ఇష్టానుసారంగా గూడూరు నుండి మహాబూబాబాద్ వైపుకు ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే నడుస్తాయి.

అదేవిధంగా నర్సంపేట వైపు పోవడం మొదలుపెడితే అటువైపే బస్సులు నడుస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణికులు బస్సులలో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ విషయమై డిపో మేనేజర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన,

చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే! అంతేకాకుండా బస్టాండ్ లో టాయిలెట్స్, వాష్ రూములు, నీటి సౌకర్యాలు ఏవి లేకుండా, బస్టాండ్ మొత్తం పగుళ్లు ఏర్పడి శిథిలా వ్యవస్థకు చేరిన దానిపై పైపూతలు, తుది మెరుగులు, పైన పటారం లోన లొటారం అనే చందంగా మెరుగులు దిద్దుతున్నారు. గూడూరు లోని పత్రికా విలేకరులు తెలుగు దినపత్రికలో ఈ వార్తను పదేపదే ప్రచురించడంతో, తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికీ బస్సులు రాక బస్టాండు నిరూపయోగంగా ఉండటం బాధాకరం. ఆర్టీసీ బస్టాండ్ కు బస్సులు రాక, కనీసం నిలువ నీడ లేని 365 రోడ్డుపైనే ప్రయాణికులు కూర్చోలేరు? నిర్చోలేరు? ఏమి చేయాలో అర్థం కాక! అవస్థలు పడుతున్నారు.

డిపో మేనేజర్లు ఎందరు మారినా? ప్రభుత్వాలు ఎన్ని మారినా? బస్టాండు తీరు మాత్రం మారలేదు. గాడ నిద్రలో నిద్రిస్తున్న ఆర్టీసీ అధికారుల పనితీరులో మార్పురాలేదు, ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయాలలో, ఉన్న లోపాలను సరిదిద్దాలన్న కనీసం సోయి లేదు. ఇప్పటికైనా ప్రస్తుత బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం లెట్రిన్,

వాష్ రూమ్ లను, కనీస నీటి సౌకర్యాలు ఇప్పటికీ కల్పించకపోవడం శోచనీయం. తెలుగు దిన పత్రికలలో విలేకరులు గూడూరు బస్టాండ్ యొక్క దీన పరిస్థితి గురించి రాయడం, ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించకుండా, రేపటి నుండి బస్సులు అన్నింటినీ బస్టాండ్ లోకి పంపించేస్తాం అనే మరో వార్త ఆర్టీసీ అధికారులు కష్టపడి అచ్చు వేయించడం తప్పితే!

ఆచరణలకు మాత్రం సత్య దూరం. పత్రికల్లో వార్త వచ్చిన ప్రతిసారి జరిగే తతంగం ఇదే? ఫలితం మాత్రం శూన్యం. యధా రాజా, తధా ప్రజా అన్నట్లుగా ఆర్టీసీ అధికారుల పనితీరు ఉన్నది. మూడు సంవత్సరాలకోసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు మాత్రం బస్టాండ్ ఆవరణలో టెంట్లు వేసి, మైకులు పెట్టి హడావిడి చేయడం తప్పా? బస్సు సర్వీసులను పునరుద్ధరించి, బస్టాండుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడం మాత్రం ఆర్టీసీ అధికారులు ఆదమరిచి పోవడం అలవాటైపోయింది.

ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల బస్టాండు నిరుపయోగంగా ఉండి, శిధిలావస్థకు చేరింది. ప్రైవేట్ వాహనదారులకు ఆర్టీసీ బస్టాండు, పార్కింగ్ చేసుకునే స్టాండ్ గా మారింది. చెత్తాచెదారం పారవేసే డంపింగ్ యార్డ్ గా తయారయ్యింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి అడ్డాగా తయారైందని, గూడూరు మండల ప్రజలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట, మహబూబాద్ డిపో మేనేజర్ లైన,

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సజ్జనార్ లైన, చివరికి రాష్ట్ర ప్రభుత్వ పాలకులైన ఇప్పటికైనా చొరవ తీసుకుని, గూడూరు బస్టాండుకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని గూడూరు మండల ప్రజానీకం కోరుకుంటున్నారు.