ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సందర్శించిన ఐఆర్ఎస్ అధికారి

మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను పూర్వ విద్యార్ధి ఐఆర్ఎస్ అధికారి రాయ వెంకటేశ్వరరెడ్డి సోమవారం సందర్శించారు, ఈ సందర్భంగా వారు చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి గా అన్ని విధాలుగా సహకరిస్తామని
వారు అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మువ్వా వెంకటేశ్వర రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు . పూర్వ విద్యార్థులందరితో కలిసి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తామని , అందరూ కలిసి విరాళాలు సేకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. పాఠశాల ప్రాంగణాన్నీ అందంగా తీర్చి దిద్దాలని , పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలని పూర్వ విద్యార్థిగా తాను కోరుకుంటానని వారు అన్నారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కోరం రజిని మాట్లాడుతూ పంచాయతీ నిధుల నుండి పాఠశాల కు సిసి రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు గ్రంథాలయం, ల్యాబ్, వంటషెడ్, తాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేయాలని పూర్వ విద్యార్థులు కోరగా ప్రభుత్వం తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు, అనంతరం పాఠశాల సిబ్బంది వారిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సర్వేష్, పుల్లెపు పరంధామయ్య, తిరుపతి రెడ్డి, శ్రీరాం బృహస్పతి, శ్రీనివాస రావు, సనప భరత్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.