Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణానికి 74. 84 కోట్ల నిధులు మంజూరు

– మంత్రి ఉత్తమ్ చొరవతో తీరనున్న నిరుపేదల ఇండ్ల సాకారకల
– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
(హుజూర్ నగర్) హుజూర్ నగర్ పట్టణంలోని ఫనిగిరి గట్టు వద్ద 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ పట్టణ నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఫణిగిరి సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన భూములను కొనుగోలు చేసి ఆ భూములలో నిరుపేదలకు వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అందజేశారు. వారితోపాటు ఎక్కువమంది నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో మోడల్ అపార్ట్మెంట్ ఇంటి నిర్మాణాలు చేపట్టగా అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడం 2014 వచ్చిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి అసంపూర్తిగా ఉన్నమోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు ఇవ్వటంలో పూర్తిగా విఫలమయింది. ఇటీవల అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భం లో ఫణిగిరి గట్టు వద్ద ఆదర్శ మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించి తక్షణమే నిధులు మంజూరు చేసి పేద ప్రజలకు పంచాలని కోరారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సోమవారం ఫణిగిరి మోడల్ కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని లక్ష్యంతో రూ. 74 కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు టెండర్లను పిలిచి నిర్మాణ పనులు చేపట్టి అర్హులైన ప్రజలు గుర్తించి పేదలకు పంచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
హర్షం వ్యక్తం చేస్తున్న హుజూర్నగర్ ప్రజలు…. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో పనిగిరి మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 74 కోట్ల 84 లక్షల రూపాయల మంజూరు చేసి పనులు త్వరిత గతిన చేపట్టాలని కోరుతూ విడుదల చేసిన జీవో పట్ల హుజూర్నగర్ పట్టణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హర్ష వ్యక్తం చేస్తున్నారు.
14 సవంత్సరాల పేద ప్రజల ఆశ… తెలంగాణ ఉద్యమ కారుడు ,ఇండ్ల సాధన కమిటీ కన్వీనర్ యడ్ల విజయ్…

14 సవంత్సరాలు గా ఇండ్లు లేని నిరుపేదలు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని గత బీఅర్ఎస్ పాలనలో నిరుపేదలు ఎన్ని సార్లు ధరకాస్తులు పెట్టుకున్నా పలితం లేదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి తో సొంత ఇండ్లు లేని ప్రజల ఆష తీరడం పట్ల నిరుపేద ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతునామన్నారు.