Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేషన్ కార్డు దారులకు ఈ- కే వైసీ గడువు మరో నెల పొడగింపు..!

రేషన్ కార్డు దారులకు ఈ- కే వైసీ గడువు మరో నెల పొడగింపు..!

 

రేషన్ కార్డు ఇ కేవైసీ ఇంకా చేసుకోని వారికి శుభవార్త అందింది. రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకునేందుకు మరో నెల రోజుల పాటు గడువు పొగడించారు.

రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు ఫిబ్రవరి చివరి వరకు గడువు పొగడిస్తు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోగా రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇ కేవైసీ చేసుకోకుంటే రేషన్ కార్డులో పేరు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

 

బోగస్ రేషన్ కార్డులను ఎరివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో గత ఐదు నెలలుగా ఇ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి జనవరి 31 వరకు గడువు విధించారు. అయితే ఈ గడువును మరోసారి పొడగించారు. ఇప్పటికీ రేషన్ కార్డు ఇకేవైసీ చేసుకోని వారు దగ్గరలో ఉన్న రేషన్ కార్డు డీలర్ల వద్దకు వెళ్లి వెంటనే ఇ కేవైసీ పూర్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

రేషన్ డీలర్ వద్దకు వద్దకు వెళ్లి మీ ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ వేలి ముద్రలు తీసుకుంటారు. దీంతో రేషన్ కార్డు ఇ కేవైసీ పూర్తవుతోంది. రేషన్ కార్డు ఇ కేవైసీ ఎలాంటి రుసుం వసూలు చేయకూడదు. ఇది ఉచిత సర్వీస్. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా రేషన్ కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు. దీని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

 

అయితే చాలా మంది బోగస్ రేషన్ కార్డులతో రేషన్ పొందుతున్నారు. చాలా మంది రేషన్ కార్డులో ఉన్నవారు జీవించి లేకున్నా.. వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో తల్లి..ఆమె కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు ఉన్నారనుకుంటే.. వారి ఐదుగురు పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయి. వారు రేషన్ తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కుటుంబంలో తల్లి అనారోగ్యంతో చనిపోయింది.

 

దీంతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకు తగ్గింది. అయితే వారు ఐదుగురు ఉన్నట్లు రేషన్ తీసుకుంటున్నారు.

అందుకే రేషన్ కార్డు ఇ కేవైసీ తీసుకొచ్చారు. దీన్ని వల్ల ప్రస్తుతం బతికున్నవారే రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకుంటారు. దీంతో వారి పేరు మాత్రమే రేషన్ కార్డులో ఉంటుంది.