Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం..!

అపెరల్ పార్కులో గార్మెంట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం

రాజన్న సిరిసిల్ల బివై నగర్లోని సీఐటీయూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మూషం రమేష్, కోడం రమణలు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం సిరిసిల్ల పెద్దూరు శివారులో

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపెరల్ పార్కులో గోకుల్ దాస్ కంపెనీ వారు గ్రీన్ నీడిల్ గార్మెంట్ యూనిట్ ని ప్రారంభించడం జరిగిందన్నారు.
గ్రీన్ నీడిల్ గార్మెంట్ యూనిట్ లో పని చేస్తున్న కార్మికులతో యాజమాన్యం ఓవర్ డ్యూటీ చేపిస్తూ పని భారం మోపుతుందని,

షిప్ మెంట్ పేరుతో ఆదివారం రోజు కూడా సెలవు ఇవ్వకుండా పని చేయిస్తూ కార్మిక చట్టం ప్రకారం ఓటి ఓవర్ టైం కట్టివ్వడం లేదని, కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ ఇబ్బందులకు

గురి చేస్తున్నారని, కంపెనీలో పని చేస్తున్న కొంత మంది కార్మికులు మా సిఐటియు యూనియన్ దృష్టికి తీసుకు రావడంతో సిఐటియు యూనియన్ గా గార్మెంట్ యూనిట్ ను సందర్శించి యూనిట్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు.

కంపెనీ యాజమాన్యం చేస్తున్న శ్రమ దోపిడీని, కార్మిక హక్కులను ప్రశ్నిస్తున్న సిఐటియు సంఘ నాయకులపై యూనిట్ యాజమాన్యం, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి భయ పెట్టాలని చూస్తున్నారని,
కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతూ

కార్మిక హక్కుల సాధన కోసం పని చేస్తున్న సంఘం సిఐటియు అని గార్మెంట్ యూనిట్ యాజమాన్యం కార్మికులను చేస్తున్న శ్రమ దోపిడిపై యూనియన్ ఆధ్వర్యంలో డిసీఎల్ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్, స్టేట్ లేబర్ కమిషనర్ గార్లకు ఫిర్యాదు చేస్తామని,

అపెరల్ పార్క్ లో పని చేస్తున్న గార్మెంట్ కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింప చేసే విధంగా సిఐటియు యూనియన్ గా పోరాడు తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, ఆడెపు సంపత్, బెజుగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.