Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధికారుల అండదండలతోనే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా?

అనుమతి లేని అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేదేవరు

అధికారుల అండదండలతోనే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా?

ఆదోని (నిజంన్యూస్) మున్సిపాలిటీ లో కలిసిపోయిన మండిగిరి, సాదాపురం పంచాయితీలలో రోజురోజు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి

వాటిని అరికట్టాల్సిన పంచాయితీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కొందరు స్థానికులు అంటున్నారు  ప్రభుత్వ నిబంధనల ప్రకారం

మండిగిరి సాదాపురం, పంచాయితీల పరిధిలో నివాసానికి సంబందించిన కట్టడాలకు జీ ప్లస్ టూ అంతస్తుల వరకే అనుమతి ఉంది అయితే కొందరు జీ ప్లస్ త్రీ వరకు కట్టడాలను నిర్మించారు.

ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా  చర్యలు చేపట్టాల్సిన సంబంధిత పంచాయితీ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణదారుల
నుండి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని
ఏమి తెలియనట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కొందరు ప్రజలు ఆరోపిస్తున్నారు

అదే సామన్య ప్రజలు ఏదైనా సమస్య మీద అధికారులు దగ్గరకు వెళ్తే సవాలక్ష నిబంధనలను అడిగే  అధికారులు ఇలాంటి అక్రమ కట్టడాలను మాత్రం ఎలా సమర్థిస్తారని అంటున్నారు అంతే కాక మండిగిరి పంచాయితీ

లో ఉన్న వంక పొడుగునా లక్షలాది రూపాయలు తీసుకొని అన్ని ఉన్నవారికే అక్రమ పట్టాలు మంజూరు చేసారని దానివల్ల వంక మొత్తం కబ్జాకు గురయ్యి చిన్నగా అయ్యిందని దానివల్ల వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే ప్రజల ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడతారని అధికారులకు తెలియదా? అని

వంక పోరంబోకులో పట్టాలు ఇవ్వకూడదని అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు లంచాలు ఇస్తే ఏమైనా చేయడానికి వేనకాడబోరనే విమర్శలు వినిపిస్తున్నాయి