Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడిన పోలీస్

సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడిన పోలీస్

👉కానిస్టేబుల్ తోటా నాగముత్యం

పోలీసు అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగం.ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. డ్యూటీ చేయాల్సిందే.ఈరోజు సోమవారం మేడారం లో జరిగిన ఓ ఘటన..

పోలీసుల్లో డ్యూటీతో పాటు మానవత్వం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. ఫ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన

వ్యక్తి ప్రాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,తిరుమలకుంట పంచాయితీ లో గల పాకాలగూడెం గ్రామానికి చెందిన తోటా నాగముత్యం సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.ప్రస్తుతం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ప్రి మేడారం జాతరలో కుటుంబం తో నడుచుకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో కిందపడిపోయాడు. అదే సమయంలో మేడారంలో బందోబస్త్ భాగంగా అటుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్ తోటా నాగముత్యం సమయస్ఫూర్తితో స్పందించి ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు.

దీంతో గుండెపోటుకు గురై స్పృహ కోల్పోయిన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. హోదాను పక్కన పెట్టి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన పోలీస్ అధికారిని ములుగు ఎస్పి శబరి తో పాటు
పోలీస్ డిపార్ట్ మెంట్ , అధికారులు, ప్రజలు ప్రశంసించారు.