Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంట..!!

నియోజకవర్గానికి సేవకురాలిగా సేవ చేస్తా.

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు రుణపడి ఉంటా.

నియోజకవర్గం కృతజ్ఞత సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మహేశ్వరం, జనవరి 29 నిజం న్యూస్ ప్రతినిధి: మహేశ్వరం నియోజకవర్గానికి సేవకు రాలిగా సేవ చేసి అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజల రుణం తీర్చుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

సోమవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ వై ఆర్ గార్డెన్స్ లో జరిగిన కృతజ్ఞత సభలో ఆమె పాల్గొన్నారు. ఆర్కే పురం లోని ఖిలా మైసమ్మ దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ..

టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల గొంతుకగా ఉండి తన బాధ్యతను నెరవేరుస్తానని అన్నారు. ఇక రాబోయేది ఎన్నికల కాలమని అన్ని ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె పార్టీ శ్రేణులను కోరారు.

ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పర్యటించి ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని ఆమె తెలిపారు. ఎన్నికలలో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలు అభివృద్ధి, ధర్మానికి పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు.

తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్,

డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మహేశ్వరం ఇన్చార్జి ఎంపిపి సునీత ఆంధ్యా నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, మహేశ్వరం, కందుకూరు మండ లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంగోతు రాజునాయక్,

జయేందర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు హనుమ గల్లచంద్రయ్య, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, నియోజకవర్గం నాయకులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.