Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తైక్వాండో పోటీల్లో స్వర్ణ పథకాలు..

తైక్వాండో పోటీల్లో విజయాలు సాధించిన బాల, బాలికలకు జిల్లా కలెక్టర్ అభినందనలు,

నల్లగొండ జిల్లా ప్రతి నిధి జనవరి 29(నిజం చెపుతాం )

బాల బాలికలు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ చందన దాసరి కోరారు.
కోట్ల వియభాస్కరరెడ్డి స్టేడియం, యూసుఫ్ గూడా, హైదరాబాద్ లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ వారి ఆద్వర్యం లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో నల్లగొండ జిల్లాకు చెందిన

9మంది క్రీడకారులు బంగారు పతకాలు, 3 రజతం మరియు 8మంది కాంస్య పతకాలను సాధించి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచి, బంగారు పథకాలు సాధించిన బాల బాలికలకు సోమవారం జిల్లా కలెక్టర్ చందన దాసరి అభినందనలు తెలిపారు. థైకాండో పోటీలలో గెలుపొందిన బాల బాలికలు

ఫిబ్రవరి 2 నుండి 4 వరకు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 37వ జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కర్యదర్శి యం. డి. యూనుస్ కమాల్ తెలిపారు. తైక్వాండో క్రీడలో నల్లగొండ జిల్లా క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని,

అదే విధంగా తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి A. ప్రవీణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమం లో , కోశాధికారి ఏ ప్రణీత్ పాల్గొన్నారు.
పథకాలు సాధించిన వారిలో

బంగారు పతకాలు సాధించిన అమ్మాయిలు

1. U-18 కిలోల బాలికలు – జునేరా కుల్సుమ్.

2. U-20 కేజీల బాలికలు – ఉమైమా జైనాబ్

3. U-26 కేజీల బాలికలు – మయేరా కుల్సుమ్

అబ్బాయిలు.

1. U-18 కేజీల బాలురు – అబ్దుర్ రెహ్మాన్ జక్రియా.

2. U-23 కేజీల బాలురు – ఎన్.అభిరామ్ జనిత్ కుమార్

3.యు-27 కేజీలు బాలురు – మహ్మద్ జైద్

4. U-29 కేజీల బాలురు – MD. అబ్దుల్ ముక్సిత్

5. U-35 కేజీల బాలురు – లింగంపల్లి హర్ష

6. U-41 కేజీల బాలురు – MD.ఫిరాజ్ ఖాన్
లు ఉన్నారు