Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

35 కిలోల గంజాయి చాక్లెట్లు

35 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం, వ్యక్తి అరెస్ట్,

మేడ్చల్ జిల్లా ప్రతినిధి,జనవరి 28, ( నిజం న్యూస్)

ఉప్పల్ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి రామంతపూర్ గాంధీనగర్ కాలనీ లో ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ జీవన్ కిరణ్ పర్యవేక్షణలో

సుభాష్ చంద్ర సిఐ కుర్మా నాయక్ ఎస్ఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి ముందుగా పేరు లేని కిరాణా దుకాణం గాంధీనగర్ నియర్ ఇండస్ట్రియల్ ఏరియా ఐడిఏ ఉప్పల్ నందు ఒక్క కిలో ఐదు ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది

తదుపరి విచారణ అనంతరము అతని ఇంటిలో ఇంకా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్స్ ఉన్నాయన్న విషయము తెలుసుకుని లక్ష్మీనారాయణ నగర్ లో ఉన్న హౌస్ నెంబర్ 2-24-108/2/b/1 నందు సోదాలు నిర్వహించి

మరో 34 కిలోల చాక్లెట్లను మొత్తం 7000 చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఇట్టి చాక్లెట్లను ముద్దాయి అయినా ఫిరోజ్జన సన్నాఫ్ విశ్వేశ్వర్ జన వయసు 39 సంవత్సరాలు ఒరిస్సాలోని

జలేశ్వర్ నుండి ట్రైన్ లో తీసుకు వచ్చినట్టు తెలిపారు, ముద్దాయిని అరెస్టు చేసి ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది,

ఇట్టి దాడులలో ఏసీ చంద్రయ్య ఏ ఈ ఎస్ జీవన్ కిరణ్ సిఐ సుభాష్ చంద్ర కూర్మా నాయక్ ఎస్ఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ మరియు సిబ్బంది శ్రీనివాస్ గోవర్ధన్ కిషన్ రవి పాల్గొన్నారు,