Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏ కార్యకర్తను విస్మరించేది లేదు

•నియోజక వర్గంలో గ్రూపులకు తావు లేదు.
•అన్ని వర్గాలకు టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే సమన్యాయం.
•ప్రతి ఇంటకీ సంక్షేమ పథకాలు.
•ఓటు అడిగే నైతిక హక్కు టి.ఆర్.ఎస్ కే వుంది.
మన్యం టీవీ ఏటూరునాగారం:
ఏ కార్యకర్తను విస్మరించేది లేదని ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనని ములుగు జడ్పీ చైర్మన్ కుమ జగదీశ్వర్ అన్నారు. ఈ రోజు ఏటూరునాగారం మండల కేంద్రంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక ములుగు నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుందని కావునా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ప్రతి ఒటరును ఓటు నమోదు అయ్యే విధంగా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భవిష్యత్తు కార్యచరణ పై దిశా , నిర్దేశం చేశారు. ప్రతి మండలంలో రాబోవు రోజులలో ప్రతి మూడు నెలల కొకసారి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. గ్రామాల్లో అవసరం మౌళిక సదుపాయాలపై గ్రామ స్థాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను కూడా ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చినాను కాబట్టి కార్యకర్తల సాదకబాదకాలు తనకు తెలుసునని ఏ కార్యకర్తను కూడా ను చెలించేది లేదన్నారు. నియోజక వర్గంలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని , రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒటరు ఓటు అడిగే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసిఆర్ అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయనడంలో సందేహం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేవలం టిఆర్ఎస్ పార్టీలోనే న్యాయం జరిగిందన్నారు. నియోజక వర్గంలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని కేవలం కేసిఆర్, కేటిఆర్ గ్రూపులు మాత్రమే ఉన్నాయని , తనకు వ్యక్తిగత ఎజెండా లేదని తాను అను నిత్యం టిఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం మాత్రమే కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజక వర్గ mlc ఎన్నికల కోఆర్డినేటర్ గోవిందు నాయక్, ఏటూరునాగారం , మంగపేట, కన్నాయిగూడెం మండలాల మండల అధ్యక్షులు గడదాసు సునిల్ కుమార్, కుడుముల లక్ష్మీ నారాయణ, సుబ్బుల సమ్మయ్య, జడ్పీ కోఆప్సన్ సభ్యురాలు వలియాబి, ఆత్మ చైర్మన్ లు దుర్గం రమణయ్య, బైకాని ఓదెలు,మంగపేట పిఎసిఎస్ చైర్మన్ రమేష్,తుమ్ము మల్లారెడ్డి , శ్రీధర్ వర్మ, తుమ్మ సంజీవ రెడ్డి, సర్దార్ పాషా, చిన్న కృష్ణ , శ్రీహరి, కొండాయి చిన్ని,తాహెర్ పాషా తదితరులు పాల్గొన్నారు.