Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎన్.ఎం.ఎం.ఎస్. పరీక్షలో సత్తాచాటిన మెళ్ళూరు హైస్కూల్ విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా (మెళ్ళూరు ) జనవరి 27.. (నిజం చెపుతాం న్యూస్) ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించుటకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్టాత్మక నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు మెళ్ళూరు శ్రీ చవ్వాకుల పెదభూలోకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన ఒపిఎస్ వి చక్రిశ్వర్,డిఎస్ఎస్ సుదర్శిని ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి.లక్ష్మి శనివారం విలేకరులకుతెలియజేసారు.ఈ సందర్బంగా హెచ్.ఎం. జి.లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షల నేపధ్యాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో మెళ్ళూరు హైస్కూల్ నందు తొలిసారి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందని, తొలిప్రయత్నంలోనే ఇరువురు విద్యార్థులు ఎంపిక కావడం చాలా స్ఫూర్తిదాయకం అని విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.అలాగే ఈ పరీక్షకు హాజరైన మిగతా విద్యార్థులు కూడా భవిష్యత్ నందు తప్పనిసరిగా ఉత్తమ ప్రతిభ కనపరుస్తారని భరోసా నిచ్చారు.

ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు…

గ్రామీణ ప్రాంతమైన మెళ్ళూరు నందు తమ చిన్నారులు ఎన్.ఎం.ఎస్.ఎస్. సాధించడం పట్ల చక్రిశ్వర్ తల్లిదండ్రులు భూలోకం, పార్వతి అలాగే సుదర్శిని తల్లిదండ్రులు వీర్రాజు,విజయ ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ లో హెచ్.ఎం. జి.లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల సిబ్బందితో పాటు కొమరిపాలెం నందు సచివాలయ ఉద్యోగిగా సేవలు అందిస్తున్న జి.లక్ష్మినారాయణ కూడా స్వచ్చందంగా మెంటల్ ఎబిలిటీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ సందర్బంగా హెచ్.ఎం జి.లక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందానికి, అలాగే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినలక్ష్మీనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

గ్రామ ప్రముఖుల,ప్రజల హర్షం..

హెచ్.ఎం.గాబాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్.ఎం.ఎం.ఎస్. పోటీపరీక్షలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇచ్చి ఈరోజు మెళ్ళూరు హైస్కూల్లో ఇరువురు విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయ్యేలా విశేష కృషి చేసిన పాఠశాల హెచ్.ఎం.జి.లక్ష్మిని గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి.సత్య సాయిరాం, ఉప సర్పంచ్ కొమ్మన.ఆనంద్ గ్రామ ప్రముఖులు మరియు గ్రామ ప్రజలు అభినందించి ధన్యవాదాలు తెలియజేసారు.