Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పద్మ విభూషణ్…ని కైవసం చేసుకున్న కొణిదెల

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో సుపరిచితులైన నటుడు కొణిదెల చిరంజీవి.

తన నటనతో మెస్మరైజింగ్ డాన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాదిమంది అభిమానులను తన కైవసం చేసుకున్నారు.

తన నటనతోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది నిరుపేదలకు సహాయం అందించి, తనలో ఉన్న మానవత్వాన్ని చాటి చెప్పారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే తమ సంస్థతో ఎంతోమందికి ఉచిత రక్తాన్ని అందించి వారి ప్రాణాలు నిలబెట్టారు.

తాను చేసిన సేవా కార్యక్రమాలను ఎంతోమంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. 2024 లో జరగబోయే పద్మ అవార్డ్స్ కు ఎంపికయ్యారు.

తాను చేసిన సేవలకు గాను అత్యంత గౌరవమైన పద్మ విభీషణ్ పురస్కారాని దక్కించుకోబోతున్నారు. దేశంలోనే భారతరత్న తరువాత అతిపెద్ద రెండవ గౌరవమైన పురస్కారం పద్మ విభూషణ్. తాను చేసిన సేవలకు గాను ఈ పద్మ విభీషణ్ అనే గౌరవ  పురస్కారం దక్కుతుంది.

కొణిదెల చిరంజీవి చేసిన సేవలకు గాను తనకు ఈ పురస్కారం అందబోతుంది.