Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రూ: 500 అడిగినందుకు, గొంతు నులిమి హత్య

ఇచ్చిన రూ: 500 తిరిగిమ్మని అడిగినందుకు, గొంతు నులిమి హత్య

 

గూడూరు మండల రిపోర్టర్ జనవరి 25. (నిజం చెబుతాం న్యూస్)

– గురువారం రోజున గూడూరు మండల కేంద్రం పరిధిలోని, కోబల్ తండా గ్రామ శివారు మూడు గుడిసెలు, లైన్ తండా కు చెందిన

తేజావత్ ఈరమ్మ భర్త: కీ,,శే,, హనుమా, 58 సంవత్సరాలు లంబాడా కూలి, తన తండాకే చెందిన తేజవత్ స్వామి తండ్రి: బాల్య 64 సంవత్సరాలు, లంబాడా కు వ్యవసాయం కోసం 500 రూపాయల అప్పుగా ఇచ్చి,

మరల తిరిగి ఇవ్వమని అడుగుతూ గత మూడు రోజులుగా తన ఇంట్లో వాళ్లకు కూడా చెప్పి తిడుతుంది, అనే కారణంతో నిన్న అనగా తేదీ.24 జనవరి 2024 రోజున రాత్రి

వీరమ్మ నిద్రిస్తున్న సమయంలో, తమ ఇంటికి వెళ్లి, పడుకున్న ఈరమ్మని గొంతునులిమి తేజావత్ స్వామి హత్య చేశాడు. తేజవత్ ఈరమ్మ కుమారుడు తేజావత్ వీరన్న, తండ్రి: కీ,,శే,, హనుమా, 48 సంవత్సరాలు, లంబాడ, కూలి ఇచ్చిన దరఖాస్తు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.