Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జైలర్ కు రాష్ట్రపతి అవార్డు….

జైలర్ ఎడారి రామయ్య కు రాష్ట్రపతి అవార్డ్

 

అభినందించిన జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా

 

జిల్లా ప్రతినిధి జనవరి 25 (నిజం న్యూస్) మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తన స్వగ్రామమైన మణుగూరు రామానుజవరం గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన యడారి రామయ్య ను అభినందిస్తున్న జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా.

జైలర్ రామయ్య కు రాష్ట్రపతి అవార్డ్ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో జైలర్ గా విధులు నిర్వహిస్తున్న యడారి రామయ్య కు ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్-2024 అవార్డు సాధించారు.

యడారి రామయ్య 1999 లో, డిప్యూటీ జైలర్ గా ఉద్యోగం పొంది, రాజమండ్రి, చర్లపల్లి కేంద్ర కారాగారాలు. విజయవాడ జిల్లా జైలులో విధులు నిర్వర్తించారు ప్రస్తుతం ప్రిజన్ హెడ్ క్వార్టర్ట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.

కాకతీయునివర్శిటీ పరిధిలో, పిజి (ఎకనామిక్స్) 4 వ ర్యాంక్ పొందారు… భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం రామానుజ పురం గ్రామానికి చెందిన రామయ్య నిరుపేద కుటుంబంనుండి ఈ సాయికి ఎదిగారు.

అవార్డు వచ్చిన రామయ్య ను జైళ్ల శాఖ డిజి సౌమ్యమిశ్రా, జైళ్ల శాఖ ఐజీ లు డిఐజీలుఅభినందించారు..