Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విలేఖరి పై కత్తులు గొడ్డల్లతో దాడి

విలేఖరి పై కత్తులు గొడ్డల్లతో దాడి

 

-తీవ్ర గాయాలపాలైన ప్రజా గొంతుక రిపోర్టర్ సంగిశెట్టి క్రిస్టఫర్

 

వలిగొండ జనవరి 25 (నిజం చెపుతాం)

మండలంలో పనిచేయుచున్న ప్రజా గొంతుక విలేఖరి సంగిశెట్టి క్రిస్టఫర్ పై గురువారం కత్తులు గొడ్డల్లతో దాడి జరిగింది. తలకు తీవ్ర గాయాలైన క్రిస్టఫర్ ని స్థానికులు 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పూర్తి వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఉండాడి యాదమ్మ సంగిశెట్టి క్రిస్టఫర్ ను తమ ఇంటికి రమ్మని పిలిచింది.

ఇదే అదునుగా భావించిన ఉండాడి యాదయ్య, ఉండాడి అంజయ్య, ఉండాడి కిష్టయ్య, కోనేటి సరిత, ఉండాడి మత్స్యగిరి, కోనేటి ఈదయ్య, బొలుగుల నరసింహ ఉండాడి రేణుక, అను వ్యక్తులు దాడి చేశారని కిష్టఫర్ తెలియజేశారు.

గతంలో ఉండాడి యాదమ్మ దాడి చేసిన వారిపై కేసు పెట్టడంతో ఇదంతా క్రిస్టఫర్ చేయించడానే కారణంతో అతనిపై దాడి చేశారన్నారు. ఇసుక ట్రాక్టర్లను కూడా పట్టిస్తున్నాననే కారణంతో కూడా దాడి చేసినట్టు ఆయన తెలియజేశారు.

దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.