Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మే 9 నుండి ఎంసెట్ రాత పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఎంసెట్ రాత పరీక్షలపై కసరస్తులో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల షెడ్యూల్ ను రూపొందించడంలో భాగంగా గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో భేటీ అయిన తర్వాతే పరీక్ష తేదీలను ప్రకటించారు.

విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మే 9,10, 11 ఇంజనీరింగ్, 12 నుండి 13 వరకు ఎంసెట్  ఫార్మసీ, అగ్రికల్చర్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు.

టీఎస్ ఎంసెట్ .. ఈఏపిసెట్ గా మార్పు…

టీఎస్ ఎంసెట్ ఇకనుండి ఈఏపీ సెట్ గా  మార్పు జరిగినది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు పంపగా గురువారం ఉత్తర్వులు వెలువడినాయి.

నీట్ ద్వారా మెడికల్ సీట్లు, ఎంసెట్ ద్వారా ఫార్మసీ విభాగం సీట్లను భర్తీ చేయనున్నారు.