Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోయిన మొబైల్ ని సులువుగా గుర్తించే పోర్టల్…!

నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న ముప్పై మంది బాధితులకు అందజేత

—మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి.

నల్లగొండ డిఎస్పి శ్రీధర్

నల్లగొండ జిల్లా ప్రతినిధి జనవరి 25 నిజం చెపుతాం

CEIR పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 30 మంది బాధితులకు జిల్లా ఎస్పీ అధ్వర్యంలో నల్లగొండ డిఎస్పీ శ్రీధర్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన,దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని తెలిపారు.

ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని, ఎవరైతే వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుంది అని తెలిపారు.

మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలని . ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందిఅన్నారు .

చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2 టౌన్ యస్.ఐ నాగరాజు,కానిస్టేబుల్ బాలకోటి నీ డిఎస్పీ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ 2 టౌన్ సిఐ పి.యన్.డి ప్రసాద్,యస్. ఐ నాగరాజు మరియు కానిస్టేబుల్ బాలకోటి పాల్గొన్నారు.