Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

25లక్షల వరకు నగదు రహిత చికిత్స

12 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించిన అత్యాధునిక వసతులతో కూడిన

మాత శిశు ఆసుపత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం జనవరి 25 (నిజం చెపుతాం) స్థానిక పట్టణ లో నాబార్డ్, ఎక్స్ ఎక్స్ ఐ వి నిధులతో దాదాపు రూ.12.60 కోట్ల అంచనా వ్యయంతో ప్రాంతీయ ఆసుపత్రి ఆధునీకరణ మరియు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసన సభ సభ్యులు శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమాజ అభివృద్దిలో ముఖ్యభూమిక పోషించే విద్యా-వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, ప్రజల వద్దకు పాలన అందించడం మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష లాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజల వద్దకు ఆరోగ్యాన్ని అందించడం,

ఆరోగ్యశ్రీ లో భాగంగా సుమారు 3257 వ్యాధులను చేర్చడమే కాకుండా, నగదు రహిత చికిత్సను రూ 25లక్షల వరకు పెంచి, పేదవారికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలియజేసారు.

రానున్న రోజుల్లో ప్రజలందరూ మరొక్కసారి జగనన్నను గెలిపించుకుని, ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం మునిసిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మి, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సుధాకర్ రెడ్డి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్లు, స్థానిక కార్పొరేటర్, ఇతర ప్రజా ప్రతినిధులు, వైద్య శాఖ అధికారులు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు.