ఎమ్మెల్సీ ఓట్ల నమోదు దరఖాస్తులను అందజేస్తున్న సిపిఎం పార్టీ మండల కమిటీ

ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం లో భాగంగా సోమవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల దరఖాస్తులను స్థానిక ఎమ్మార్వో శ్రీధర్ కు సమర్పించారు.
ఈ సందర్భంగా మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..వామపక్షాల తరపున పోటీ చేస్తున్న నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల అభ్యర్థి గెలిపించాలని కోరారు. ప్రజల తరఫున నిజాయితీగా చట్టసభల్లో ప్రజావాణి వినిపించాలంటే వామపక్షాలు అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బయ్యారాము
రాయల వెంకటేశ్వర్లు సభ్యులు బర్లతిరుపత రావు, కోమర్రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు .