Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వైన్స్ లో ‘నిల్ ‘ బెల్ట్ లో ఫుల్

వైన్స్ లో ‘నిల్ ‘ బెల్ట్ లో ఫుల్

 

 

– పట్టించుకోని ఎక్స్చేంజ్ అధికారులు

 

– బెల్ట్ షాపును ప్రోత్సహిస్తున్న వైన్ షాపు యజమాన్యాలు

 

– పాలు,పెరుగు సరఫరా కంటే బెల్టు షాపులకు వైన్ సరఫరా ఎక్కువ

 

-బెల్టు షాపులకు డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్న వైన్స్ షాప్ వాహనాలు

 

ఉదయం 5 గంటల నుండే బెల్ట్ షాపు లకు సప్లయ్ చేస్తును వైన్స్ యాజమాన్యాలు

 

బెల్ట్ షాపుల్లో ప్రీమియం బ్రాండ్లు

 

24 గంటలు అందుబాటులో మద్యం

 

పట్టించుకోని ఎక్సైజ్ శాఖ

 

మద్యం దుకాణాల పక్కనే సిట్టింగులతో దాబాలు

 

మరిపెడ ప్రతినిధి జనవరి24 నిజం న్యూస్

 

మరిపెడ మండల పరిధిలోని మొత్తం ఐదు మద్యం దుకాణాలు ఉండగా బెల్ట్ షాప్ లు మాత్రం 100ల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు అక్కడక్కడ వీధి చివర్లో కనిపించే బెల్ట్ షాపులు ప్రస్తుతం దేవాలయాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు, స్కూలు అనే తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకుని మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం బెల్ట్ షాపులపై కొరడా చూపిస్తున్నప్పటికీ ఆయా బెల్ట్ షాపులు బరితెగించి మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.. ఇంత జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది.

 

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకు అమ్మాలి అనే నిబంధన ఉండడంతో అక్రమార్జనకు బెల్ట్ షాపులే ఆశ్రయమయ్యాయి. కిరాణా షాపులు, బడ్డీ దుకాణాలు, మద్యం ఏరులై పారుతోంది. మద్యం దుకాణా దారులు బెల్ట్ షాపుల యజమానుల నుండి పది రూపాయల నుండి 20 రూపాయల నుండి వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇదే అదునుగా బెల్ట్ షాపుల యజమానులు ఒక్కో క్వార్టర్ పై 50 రూపాయల నుండి 70 రూపాయల వరకు సామాన్యుల నుండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అంతే కాకుండా మద్యం ప్రియులు ఇష్టపడే బ్రాండ్లను రాయల్ స్టాగ్ ,ఇంపీరియల్ బ్లు ( ఐబి) ,యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్ ఫిషర్ లైట్ ,మొత్తాన్ని బెల్ట్ షాపులకే పరిమితం చేసి మద్యం ప్రియులను బెల్ట్ షాపులకు దారి మళ్లించి అధిక వసూళ్లకు పాల్పడుతూ లక్షల్లో గడిస్తున్నారు.

రోజంతా కూలీ పని చేసుకుని సాయంత్రం అయ్యేసరికి మద్యం అలవాటు ఉన్న సామాన్యులను ఈ రీతిలో జేబులు ఖాళీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు నిద్రావస్త నటిస్తోంది.. అలాగే మద్యం దుకాణాల ముందు బెల్ట్ షాపు నిర్వాహకులు ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్ లో నిలబడి మద్యం కొనుగోలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు… బెల్ట్ షాపు నిర్వాహకులకు మధ్యాన్ని విక్రయిస్తున్న మద్యం దుకాణదారులు మద్యం ప్రియులు వెళ్లేసరికి సరుకంతా అయిపోయిందని చెబుతుండడం కొసమెరుపు..

కేవలం బెల్ట్ షాపుల నిర్వాహకుల కోసమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినట్లు తేటతెల్లమవుతుంది..

 

మద్యం దుఖానాల పక్కనే సిట్టింగులతో దాబా

 

మండల పరిధిలోని ఉన్నటువంటి ఐదు మద్యం దుకాణాల పక్కనే పలు ప్రాంతాలలో సిట్టింగులతో కూడిన దాబాలను ఏర్పాటు చేసుకొని విక్రయాలు కొనసాగిస్తున్నారు.. మద్యం దుకాణదారులు బెల్ట్ షాప్ లకు సరఫరా చేస్తూ వస్తున్న లాభాలను పరిగణలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులకు తరలిస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు వేస్తున్నారని తెలుస్తోంది.. ఇకనైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణ యజమానులపై కఠిన చర్యలు చేపట్టి మద్యం దుకాణాల ఆగడాలను అరికట్టాలని ప్రజాసంఘాలు, పరిసర ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు…