Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పైపుల సాకుతో పైకం వసూలు

పైపుల సాకుతో పైకం వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు

మోతె జనవరి 24 నిజం చెపుతాం

బుధవారం మండల కేంద్రంలో గల జానకి ఇండియా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో జానకి ఇండియా గ్యాస్ ఏజెన్సీ లో కనెక్షన్ ఉన్న లబ్ధిదారులకు ఈ కె వై సి ఉచ్ఛితంగా చేయాలనే నిబంధన ఉండి కూడా నిరుపేదలైన లబ్దిదారులకు ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన వారికి తప్పనిసరిగా ఈ కె వై సి చేఇంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుండి మార్గ దర్శకాలు రావటంతో తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లలో బాగంగా 500 వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకూ చెందిన అన్ని గ్యాస్ ఏజెన్సీ ల లబ్ధిదారులు రోజు వారి పనులకు వెళ్ళకుండా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న లబ్ధిదారులు ఏజెన్సీ ల వద్దకు పరుగులు తీస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన జానకి ఇండియా గ్యాస్ ఏజెన్సీ వారు ముందస్తుగా సిరికొండ గ్రామంలో ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ , తో పాటు గ్యాస్ బుక్ లను తీసుకొని ప్రతి ఒక్కరు ఒక వంద రూపాయలు తీసుకురావాలని చెప్పటంతో జానకి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహకుడుని వెంటనే లబ్దిదారులు అందరు మేము దేనికి డబ్బులు చెల్లించాలని ప్రశ్నిచంగా గ్యాస్ పైపులు ఇస్తామని గ్యాస్ పైపు తీసుకుంటేనే ఈ కె వై సి చేస్తామని దాబాయించినట్లు పలువురు తెలిపారు.

టమక వేసినప్పుడు ఎలాంటి ఖర్చులు లేవని ఇప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతున్నారని నిలదీసినప్పటికి గ్యాస్ పైపులు తీసుకున్న వారికి మాత్రమే ఈ కె వై సి చేస్తామని చెప్పాడని మాకు ఇంతకు ముందే గ్యాస్ సిలిండర్ కు పైపు ఉన్నదని చెప్పిన మా దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని గ్యాస్ ఏజెన్సీ వారు ముందుగా ఉచ్ఛితంగా ఈ కె వై సి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 190 చొప్పున వసూలు చేశారని మా సిరికొండ గ్రామంలో సుమారు 300 మంది దగ్గర వసూలు చేశారని గ్యాస్ ఏజెన్సీ వారు 50 వేల నుండి 60 వేల వరకు వసూలు చేశారని గ్రామస్థులు గొడవకు దిగినారు.

గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు సోమన్న

వివరణ ఈ రోజు సుమారుగా 300 వందల మంది కి ఈ కె వై సి చేశాను ఇంకా కూడా చేయాల్సి ఉంది ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు గ్యాస్ పైపుల కు మాత్రమే డబ్బులు తీసుకుంటున్నాను.

లబ్దిదారుల వివరణ

ఊరిలో టమక వేసినప్పుడు ఒక తీరుగా చెప్పారు వేలు ముద్ర వేసేటప్పుడు గ్యాస్ పైపు కు 190 రూపాయలు వసూలు చేస్తున్నారు పది మంది కలిసి గొడవ చేసినప్పటికీ డబ్బులు ఇస్తేనే ఈ కె వై సి అవుతుందని ఎదురు దాడికి దిగినట్లు చెప్పారు.