Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు గిరిజన విద్యార్థి ఎంపిక….!!

ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకలకు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల రెడ్యాల విద్యార్థి ఎంపిక….!!

స్టేట్ బ్యూరో జనవరి 24 ( నిజం న్యూస్)

మహబూబాబాద్ మండల పరిధిలోని శివారు రెడ్యాల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకల్లో ఎంపికయ్యారని గిరిజన క్రీడల అధికారి ధరావత్ మోహన్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. వెంకటరెడ్డి తెలిపారు.

ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జె.పండు జాతీయస్థాయి ఖో – ఖో నందు మూడుసార్లు ఆడడం జరిగింది అట్టి విద్యార్థికి గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం లభించిందని తెలిపారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇతనికి ఆహ్వానం అందిందని వారు తెలిపారు.

ఈ విద్యార్థికి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఇతనికి ఢిల్లీకి పంపడం జరిగింది. వీరికి ప్రధానమంత్రి తో పరిచయ కార్యక్రమం మరియు దేశ గణతంత్ర వేడుకల్లో పాల్గొని భాగ్యం కలిగించి ఈ విద్యార్థిని మరియు విద్యార్థిని తయారుచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు డి. మోహన్ నాయక్ ను ఐ.టీ.డీ.ఏ. ప్రాజెక్టు అధికారి అంకిత్ గిరిజన సంక్షేమ శాఖ మహబూబాబాద్ డి. డి. ఎం. ఎర్రయ్య ఏసి.ఎమ్ఓ.ఈరు లాల్ ఏ.టీ.డీ.ఓ. సత్యవతి తదితరులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. హీరా సింగ్ , బి. వెంకన్న, డి. రామ్మూర్తి, జి. కాంతారావు, జి.సదర్, జి.దేవుల, ఏ. కిషన్, ఎస్. వెంకటలక్ష్మి, ఎం.డి. ఇస్మాయిల్, టి. హనుమంతు, పి. విజయ్ కుమార్, బి. శిరీష , బి. అరుణ్ కుమార్, టీ. పులియా, డి. అంజయ్య, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.