Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బంగారు ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్.

బంగారు ఆభరణాలు స్వాధీనం ఒకరిని అరెస్ట్ చేసిన కడియం పోలీసులు

రాజమహేంద్రవరం రూరల్: జనవరి 24 (నిజం న్యూస్)
కడియం మండలం కడియపులంక గ్రామంలో ఈనెల 22వ తేదీన పుల్లా పెద్ద సత్యనారాయణ ఇంట్లో 20.5 కాసుల 9 బంగారు ఆభరణాలు పోయినట్లు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు కడియం సీఐ పివిజి తిలక్ తెలిపారు.

దీనిపై కడియం పోలీస్ సిబ్బంది సురేష్ బాబు, రవికుమార్, భీమారావు, కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తుతో కూడిన తమదైన శైలిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బుర్రిలంకకు చెందిన ముద్దాయిని అరెస్టు చేసినట్లు కడియం పోలీసులు తెలిపారు.

దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి కే శ్రీనివాసులు సిఐ తిలక్ వివరాలను వెల్లడిస్తూ పుల్లా పెద్ద సత్యనారాయణ ఇంట్లో గత 20 ఏళ్లుగా పనిచేయుచున్న పల్లా బాబీని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు సుమారు రెండు సంవత్సరములు నుండి ఇంట్లో తొమ్మిది బంగారు ఆభరణాలను పలుమార్లు దొంగతనం చేసినట్లు వాటిలో నెమలి ఆకారంగల బ్రాస్లెట్, ఒక నల్లపూసల తాడు తన వద్ద వుంచుకుని మిగిలిన ఏడు బంగారు వస్తువులు వివిధ బ్యాంకులలో తాకట్టు పెట్టినట్లు నేరం అంగీకరించాడని సీఐ తెలిపారు.

ముద్దాయి బాబిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నెమలి ఆకారంగల బ్రాస్లెట్, ఒక నల్లపూసల త్రాడుని స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో కేసును చాకచక్యంగా సేదించిన కడియం పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీతో పాటు సౌత్ జోన్ డిఎస్పి కె శ్రీనివాసులు అభినందించారు.