Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

*మొక్కలు నాటిన పూర్వ విద్యార్థులు

పినపాక మండలం లోని పినపాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1995-96 పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు శుక్రవారం పాఠశాలలో కలిశారు. ఈ సందర్భంగా వారు చదుకున్న పాఠశాల లో స్థానిక ఎంపీటీసీ డా.చింతపండు సత్యం, సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు తో కలిసి మొక్కలు నాటారు.అనంతరం తాము చదువుకున్న రోజులను ,తమకు చదువు చెప్పిన ఉపాద్యాయులను గుర్తు చేసుకున్నారు.తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని జ్ఞాపకాలను ఒకరితోఒకరు పంచుకొని ఆనందంగా గడిపారు.అలాగే విద్యాబుద్దులు నేర్పిన తెలుగు ఉపాధ్యాయులు యర్రాప్రగడ శ్రీరామమూర్తి దంపతులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాల లో గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని మళ్లీ తమ బ్యాచ్ ఫ్రెండ్స్ తో త్వరలోనే మళ్లీ కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రసకొండ ఏడుకొండలు, ఎలిపెద్ది ప్రతాప్ రెడ్డి, నిమ్మ లింగారెడ్డి, నట్టి వీరబాబు,బండారు నరేందర్, వీరముష్టి నరేంద్ర ప్రసాద్, బాగ అశోక్ గౌడ్,చిర్రా ఉప్పలయ్య గౌడ్, తోకల శీను,అరే నరేష్, కొండేరు రామారావుతదితరులు పాల్గొన్నారు.