Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మొక్కులు చెల్లించుకున్న మంత్రి కోమటిరెడ్డి.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో మంత్రి కోమటిరెడ్డి

యాదగిరిగుట్ట:జనవరి24(నిజంచెపుతాం)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని బుధవారం రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు మంత్రోచ్ఛరణలతో పూలమాల వేసి స్వాగతం పలికారు.ప్రధాన ఆలయంలో స్వయంభుల దర్శన అనంతరం.

మొక్కులు చెల్లించుకున్నారు.అద్దాల మండపంలో ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహ చార్యులు ఇతర అర్చక బృందం వేదాశిర్వచనం చేశారు.అనంతరం ఆలయ ఈవో రామకృష్ణారావు స్వామి వారి శేష వస్త్రం అభిషేక లడ్డూ ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగె,డీసీపీ రాజేష్ చంద్ర,ఆలయ డిఈఓ భాస్కర శర్మ,ఏఈఓ లు రామ్మోహన్ రావు,గజ్వేల్లి రమేష్ బాబు, రఘు,సూపరిండెంట్ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.