Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శిథిలవస్థలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వసతి గృహం

శిథిలవస్థలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వసతి గృహం.

జిల్లా కలెక్టరు….ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ స్పందించి తక్షణమే నూతన భవనాన్ని నిర్మించాలి.

కిరాయి ఇంట్లో ఉంటున్న ఎస్సీ బాలికల హాస్టల్.

ఎస్సీ బాలికలకు సరైన సౌకర్యం లేక ఇబ్బందులు.

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు.

కురవి,నిజంచెపుతాం,జనవరి,24:

కురవి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల వసతి గృహనికి సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ ఆద్వర్యంలో స్థానిక ఎమ్మార్వో సునిల్ రెడ్డి కి వినతిపత్రం అందజేసినారు. ఆయన మాట్లాడుతూ… కిరాయి ఇంట్లో ఉంటున్న ఎస్సీ బాలికల వసతి గృహానికి సొంత భవనం కాకపోవడం వలన సౌకర్యాలు సరిగ్గా లేవు అన్నారు.దానితో పాటు ఆ భవనం శిధిలావస్థలో ఉందని అన్నారు.

కురవి మండలంలో ఉన్న ఏకైక సంక్షేమ హస్టల్ లు సరిగ్గా ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు అన్నారు..కొన్ని పదుల సంఖ్యలో వినతిపత్రాలు ఇచ్చిన ఆధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి హని కలిగిన అధికారులే భాద్యులు అవుతారని అన్నారు.జిల్లా కలెక్టరు,ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ స్పందించి,తక్షణమే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గందసిరి జ్యోతి బసు,మండల అధ్యక్ష,కార్యదర్శులు వీరెందర్,మురళి,ఉపాధ్యక్షుడు గణేష్,నాయకులు జశ్వంత్,మహేష్,నవీన్,వినయ్ ,ప్రణీత్ పాల్గొన్నారు.