Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెట్రోల్ దొంగలున్నారు జాగ్రత్త

గూడూరు మండలం కేంద్రంలోని ద్విచక్ర వాహనదారులారా, ఆదమరిచి ఉన్నారో మీ పెట్రోలు మాయం*

గూడూరు, జనవరి 23. (నిజం చెబుతాం న్యూస్):- మంగళవారం రోజున గూడూరు మండల కేంద్రంలోని, సామాజిక ఆరోగ్య కేంద్రం గూడూరు ఆవరణంలో, పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల నుండి పెట్రోలును

బాటిల్ల ద్వారా తీస్తున్న, దొంగల ముఠాదారులను, ఈ హాస్పిటల్ ఆవరణకు అనుకుని ఉన్న సునీల్ మెడికల్ ఆల్ సంబంధించిన సీసీ కెమెరా టీజీ ఫోటోల, వీడియోల ద్వారా ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది.

అంతకుముందు బాటిల్లలో పెట్రోలు తీస్తున్న వ్యక్తిని నిలదీస్తే, అతనితో పాటు ఇంకో వ్యక్తి కలిసి, వారినే నిలదీస్తూ దురుసుగా మాట్లాడుతూ, ఎదురు దాడికి దిగారు.

వారు చేసిన తతంగాన్ని మొత్తం సీసీ ఫుటేజీ ఫోటోలను చూపించడంతో మౌనం వహించారు. సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం గూడూరులో, సీసీ కెమెరాలు ఉన్నా, పనిచేయని వైనం.

ఇప్పటికైనా సీసీ కెమెరాలు పనిచేసే విధంగా తక్షణమే ఆధునికరించాలని, సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం గూడూరు స్థానిక సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న నాయక్ ను, వైద్యం కోసం నిత్యం వస్తున్న రోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, గూడూరు మండల ప్రజలు కోరుతున్నారు.

వీరిని స్థానిక గూడూరు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పెట్రోల్ తీసిన ద్విచక్ర వాహనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో, ఉద్యోగ బాధ్యతలు కలిగిన సదరు వాంకుడోత్ సర్దార్ నాయక్ తో పాటు, మరో వ్యక్తి ద్విచక్ర వాహనం నుండి రెండు బాటిళ్లలో పెట్రోల్ తీయడం జరిగింది.

సదరు బాధిత ఉద్యోగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గూడూరు మండల కేంద్రంలో గత 5,6 నెలల నుండి ద్విచక్ర వాహనాల నుండి పెద్ద మొత్తంలో పెట్రోలు చోరీలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

వీటికి పూర్తి బాధ్యత ఎవరిదో ఇప్పటికైనా పోలీస్ అధికారులు గుర్తించి, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, గూడూరు మండల ప్రజానీకం, స్థానిక గూడూరు మండల పోలీస్ శాఖ అధికారులను కోరుతున్నారు.