Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్రిబుల్ ఐటీ బాసరలో మళ్లీ మొదలైన పురుగుల అన్నం..!

వారం రోజులపాటు 24 గంటల దీక్షకు ఫలితం ఇదేనా..?

*కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటిని మార్చగలరా..?

*ఆర్జేయుకేటి బాసర త్రిబుల్ ఐటీ* *యూనివర్సిటీ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటు

– దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ అధ్యక్షతన ఏర్పాటు..

*లోపలికి పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రులు, మీడియాకు అనుమతి లేదు..?

*విద్యార్థులపై నిబంధనల పేరుతో నిర్బంధాలు పెరిగాయి.. – విద్య, వైద్యం, మౌలిక వసతులపై అభివృద్ధి మాత్రం శూన్యం..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జనవరి 21 (నిజం చెపుతాం)

సుమారుగా 72 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ స్వయంగా యూనివర్సిటీనీ నిరుపేద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక ఐఏఎస్ కమిటీ వేసి త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీని ఏర్పాటు చేయగా, ఆయన ఉన్నన్ని రోజులు దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారు.

కానీ గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పేరొకడిది..ఊరుకోడిది.. అన్నట్లు కనీసం త్రిబుల్ ఐటీ భాసర యూనివర్సిటీని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు.

ఈ విధంగా సుమారుగా 9వేల మంది విద్యార్థులు, 18 వేల మంది వారి తల్లిదండ్రులు, 1000 మంది లోపల స్టాప్ ఉంటుంది.

అంటే ఇది ఒక మండల పరిధిలో ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి యూనివర్సిటీ. కానీ 10 సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఉండడంతో సరియైన రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ గాని డైరెక్టర్ గాని రిజిస్టర్ గాని రెగ్యులర్ అధ్యాపకులు గాని లేకుండా కేవలం నామమాత్రపు పర్మనెంట్ (9) అధ్యాపకులతో నడిపిస్తూ..

సుమారుగా 200 మంది పైచిలుకు ప్రైవేటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పెట్టి ఇంటర్ అండ్ బీటెక్ విద్యార్థిని విద్యార్థులకు చదువు నేర్పించడం అనేది ఎంతవరకు సమంజసం..కానీ 10 సంవత్సరాలు సమయపాలన జరిగిందనేది జగమెరిగిన సత్యం.

ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి అప్పటి ప్రభుత్వం విద్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ మీద ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన విషయం తెలిసింది.

లోపల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంతమంది ఒక కమిటీ (ఎస్జిసి) గా ఏర్పడి సుమారుగా వారం రోజులపాటు 24 గంటల శాంతియుత రిలే నిరహార దీక్షలు చేయడం జరిగింది.

వారి దీక్ష ఫలితంగా అప్పటి ఐటి శాఖ ముఖ్యమైన మంత్రి, విద్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దేవదాయ శాఖ మంత్రి తదితరులు పలుమార్లు విజిట్ చేసి కచ్చితంగా మీ పిల్లలు, మా పిల్లల వలె అని చెప్పి.. అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో రాజకీయంగా మీడియాలో ఎన్నో మాటలు చెప్పింది కానీ కనీసం ఒక్క మార్పు కూడా తీసుకురాలేకపోయారు.

ఆరోజు పిల్లలు దీక్షలో అడిగినటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మాకు రెగ్యులర్ విసి, 24 గంటలు మా హాస్టల్లో ఉండే విధంగా పెర్మనెంట్ అధ్యాపకులు, నిర్బంధమైనటువంటి విధివిధానాలు లేకుండా ఫ్రీడమ్ తో కూడిన విద్యా, వైద్యం, మౌలిక వసతులు కావాలని, పెర్మనెంట్ అధ్యాపకులు కావాలని ప్రధానంగా కోరడం జరిగింది.

కానీ ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా దాదాపుగా 10 సంవత్సరాలు కాలయాపన జరిగింది. అప్పట్లో అన్నంలో పురుగులు కప్పలు తెల్ల పురుగులు వచ్చి పిల్లలు వాంతులు చేసుకొని ఆస్పటల్ పాలైన విషయం అందరికి తెలిసిందే

అదే విధంగా త్రాగునీరు కూడా కలుషితమై ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు హాస్పిటల్ పాలైన విషయం కూడా విజితమే.

ఆ తరువాత అప్పటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వచ్చి పిల్లలతో పాటు లంచ్ చేసి ,మా పిల్లలతో పాటు బాసర యునివర్సిటీ పిల్లలకు కూడా సరైన భోజనాలు, మౌలిక వసతులు, లాప్టాప్స్, స్పోర్ట్స్ బిల్డింగ్స్, మీటింగ్ హాల్, చేర్స్, స్టేజ్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లి ఇంతవరకు కూడా ఏ ఒక్కటి చేయని పరిస్థితి నెలకొంది.

మళ్లీ ఈరోజు అనగా ఆదివారం మధ్యాహ్న భోజనంలో (లంచ్) పురుగులు రావడంతో విద్యార్థిని విద్యార్థులు ఒక్కసారిగా మళ్లీ పాత విషయాలను నెమరు వేసుకుంటూ అవాక్కయ్యారు.

ఈ పురుగుల అన్నం ప్లేట్స్ కొంతమంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పంపించగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మేరకు పేరెంట్స్, కమిటీ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీలో నిర్బంధాలు, నినాదాలు ఎక్కువయ్యాయి తప్ప, విద్యా, వైద్యం, మౌలిక వసతులు కానీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అర్బటాలు, నిర్బంధాలు తప్ప, మా విద్యార్థిని విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని వాపోయారు.

ఇంటర్ రెండు సంవత్సరాలు ఈ టెక్నాలజీ యూనివర్సిటీలో లాప్టాప్స్ లేకుండానే మా విద్యార్థిని విద్యార్థులు రేకుల షెడ్లలో నిమిషం నిమిషం భయభ్రాంతులకు గురై బ్రతికారని అటు తర్వాత పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయగా మా విద్యార్థులకు పక్క భవనాలు ఇచ్చారని, ఆరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఎన్టీవీ మీడియాలో మాట్లాడుతూ..

ఎంతమంది వచ్చినా ఒక వెండర్ గాని టెండర్లు గాని మార్చలేరనే విషయం ఈరోజు సుస్పష్టం అయిందని, దీని వెనకాల ఎవరున్నారో కూడా ప్రజలకు అర్థం అయిపోయిందని, కానీ అదే ప్రజలు, బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థుల యొక్క పాపం తగిలి ప్రభుత్వమే పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా కనీసం బాసర యూనివర్సిటీలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు గాని, పేరెంట్స్ కమిటీ గాని మీడియా గాని లోపలికి అనుమతి లేకపోవడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని, ఈ విషయంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు చొరవ తీసుకొని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, పేరెంట్స్ కమిటీకి, మీడియాకు లోపటికి అనుమతి ఇవ్వాలని కోరారు.

అదే విధంగా అతి త్వరలోనే ఈ ప్రభుత్వం ,సీఎం రేవంత్ రెడ్డి వెండర్ ను మార్చాలని,వెంటనే టెండర్లు వేయాలని, మీడియాకు లోపటికి అనుమతి ఇవ్వాలని ప్రత్యేకించి కోరారు.

జిల్లా కలెక్టర్ వెంటనే పై విషయాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, డిన్నర్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

లేనిపక్షంలో పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలవాలని పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రులు కోరుతున్నారు.