Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా …చేరికలు.

పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి ప్రతినిధి జనవరి 21 నిజం చెపుతాం న్యూస్

అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామ సర్పంచ్ శీలం జ్యోతి రాములు వారితో పాటు పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం *తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగింది.

నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు వంద రోజులు ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ప్రతి కార్యకర్త పాలుపంచుకోవాలని కోరారు.