అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్సై శ్రీకాంత్…
మండలంలోని గుండెపుడి గ్రామ సమీపంలో శనివారం ఎస్సై శ్రీకాంత్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించారు. వీరు చండ్రుగొండ మండలం గానుగుపాడు ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. పట్టుబడ్డ ట్రాక్టర్ ల పై కేసు నమోదు చేశారు.