Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లి)

జనవరి 13.. నిజం న్యూస్..

(చల్లా శ్రీనివాస్.. నిజం రిపోర్టర్ )

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయఅధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే అధికార వైస్సార్ పార్టీ పలు ధపాలుగా, అసెంబ్లీ, లోకసభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది.

ఈ నేపథ్యంలో వీరి ఇరువురి భేటీ చాలా కీలకంగా మారింది.ఈ భేటీలో సీట్ల సర్దుబాటు,అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి అజెండా,ఇరు పార్టీల ఓట్లు పరస్పర బదిలి అయ్యేలా వ్యూహ రచనతో పాటు కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీని కూడా కలుపుకుని వెళతారా? అనే అంశాలు ప్రస్తావనకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే రేపు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ సంయుక్తగా కలిసి రాజధాని గ్రామం “మందడం” లో తెలుగుజాతికి స్వర్ణ యుగం -సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి వేడుకల్లో పాల్గొంటారని, ఇరువురు నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తారని, అనంతరం ఇరువురు నేతలు రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తారని పార్టీ శ్రేణుల నుండి సమాచారం అందుతుంది.

శనివారం భేటీకి పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా హాజరైనారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ను చంద్రబాబు,లోకేష్ సాదరంగా ఆహ్వానించారు.

భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటన పై ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..