Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వెంకటేశ్వరస్వామి పాదం ముద్ర ఈ భూమీపై ఎక్కడ ఉందో తెలుసా ?

ఈ అద్బుతమైన భూమి ఎన్నో విచిత్రాలు, ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి.. మనం దైవంగా కోలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదం ముద్ర ఈ భూమి పైన ఉంది అంటే మీరు నమ్ముతార.. కానీ ఇది నిజం.. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పాదముద్ర ఈ భూమిపైన ఉంది.. అది ఎక్కడ ఉందో చాలా మందికి తేలిసి ఉండదు.. స్వామి వారి పాదముద్ర ఎక్కడ ఉందో తెలుసుకుందాం…. ఈ ప్రదేశంలో స్వామి పాదముద్ర చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది.. అప్పలాయగుంటకు ధక్షణంలో ఉన్న యోగుల పర్వతంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదముద్ర ఉంటుంది. ఈ పాదముద్ర ఇక్కడకు ఎలా వచ్చిదంటే స్వామివారు ఆకాశ రాజు కుమార్తెను వివాహం  చేసుకుని కాలి నడకన తిరుమలకు వెళ్ళతున్న సమయంలో అప్పలాయగుంటలో తప్పస్సు చేసుకుంటున్న సిద్దేశ్వర స్వామిని ఆశీర్వధించాడు.. అప్పలాయగుంట వెనుక ఉన్న యోగుల పర్వతం స్వామివారి పాదం యొక్క శక్తికి తట్టుకోలేక అనిగిపోతుంటే స్వామి వారి అభయహస్తం అప్పలాయగుంటలో స్వామివారు కోలువుతీరాంట అని చెప్పుతుంటారు. ఇప్పటికి కూడా స్వామి వారి పాదపు ముద్ర యోగుల పర్వతం పై నే ఉంది. ఈ పర్వతంపై చాలా వేగం గాలివీస్తుంది… ఈ పర్వతం పైకి సరైన మార్గం లేకపోయినే భక్తులు కాలినడకన స్వామివారి పాదం చూడడానికి వెళ్ళుతుంటారు..