ప్రభుత్వ విప్ రేగా కోలుకోవాలని శివాలయంలో కొండేరు పూజలు
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొండేరు నాగభూషణం ఆధ్వర్యంలో సీతంపేట శివాలయలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అను క్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపించే విప్ రేగా కాంతన్న శివయ్య అనుగ్రహముతో త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీతంపేట సర్పంచ్ పోతునేని శివశంకర్, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.