Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొబ్బరి వ్యవసాయంలో కొమ్ము పురుగు సమస్యలు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..

రైతులు వ్యవసాయం చేసేటప్పుడు పంటలకు చాలా మందులు వాడుతుంటారు. పంటలు వేసినప్పుడు సాధారణంగా పంటలకు చాలా రకాలు గా ఇబ్బందులు వస్తునే ఉంటాయి. దీని కారణంగా రైతులు కొన్ని సార్లు నష్టపోవాల్సి వస్తుంది.

అయితే కొబ్బరి చెట్లు వ్యవసాయం చేసే రైతులు ఎదుర్కొనే సమస్యలేంటంటే కొబ్బరికాయ చెట్ల వ్యవసాయంలో రైతులకు ఎక్కువగా కొమ్ము పురుగు సమస్యలు ఎదుర్కొంటారు. అయితే వీటికి మందులు వాడిన కూడా మళ్ళీ 15రోజుల తర్వాత ఆ కొమ్ము పురుగు సమస్యలు మళ్ళీ వస్తుందంటున్నారు రైతులు ..

అయితే ఈ సమస్యకు ఒక న్యాచురల్ పద్దతి ఉంది.. ఎలాంటి వాడాల్సిన అవసరం కూడా లేదు.. పూర్వకాలంలో రైతులు ఈ సమస్య వచ్చినప్పుడు కొబ్బరికాయల చెట్టులో వేపాకు చెట్టు కు సబంధించిన ఆకులు, వాటి యొక్క విత్తనాలు, వేప బెరడు ను కొబ్బరి చెట్ల మధ్యలో ఉంచినట్లయితే కొమ్ము పురుగు సమస్య ఉండదూ..

దీనికి కారణం ఏంటి అంటే వేపాకులో అజాదీరెట్టిన్ ఉటుంది. ఈ అజాదీరెట్టిన్లో కీటకనాసిని గా కూడా పిలుస్తారు. ఇలా వేపాకును బాగా నలిపి కొబ్బరి చెట్లలలో పెట్టినట్లయితే కొమ్ము దీనిని ఆహారంగా తీసుకుని దాని యొక్క దీనికి పిల్లలు పుట్టకుండా, అలాగే పురుగు కొబ్బరి ఆకులను తీనకుండా ఉంటుంది.. ఈ వేపాకు బయట దొరికే మందులకన్న బాగా పనిచేస్తుంది. రైతులు ఇలా పాటిస్తే వారికి కొమ్ము పురుగు సమస్యలు అసలు ఉండదూ…