Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇకపై బ్లడ్ బ్యాంకుల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

ప్రతి మషినికి రక్తం ఎంతోగానో అవసరం… కొన్ని సమయాలలో వ్యాదుల బారినపడి రక్తం తక్కువ కావడం జరుగుతుంది. ఆ సమయంలో బ్లడ్ గ్రూప్ కు తగ్గిన రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను రక్తాన్ని డోనర్ల నుండి తీసుకొోవడం జరుగుతంది. రోగులకు అత్యవసరమైన సమయంలో బ్లడ్ బ్యాంకులు డబ్బులు అధికంగా వసూలు చేయడం జరుగుతుంది. అయితే దీనిపై డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇక నుండి కేవలం ప్రాసెసింగ్ ఫీజు తప్పమిగతా అన్ని రకాలైన ఫీజులను తొలగిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత్తం రక్తం, ప్లాస్మా, తెల్ల రక్తకణాల ఒక్క యూనిట్కు రూ. 3-8వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పటి నుండి రూ. 250 నుండి 1550 మాత్రమే వసూలు చేయాలని డీసీజీఐ ఆదేశాలు జారీ చేసింది.