Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ

జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)*

సూర్యాపేట ప్రతినిధి జనవరి 6( నిజం చెబుతాం న్యూస్)

అయోధ్య…, అయోధ్య, …అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో

అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు.

దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.

ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు…