Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉచిత బస్సు ప్రయాణం పేద ప్రజలకు వరం

ఉచిత బస్సు ప్రయాణం పేద ప్రజలకు వరం

జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ

సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్ 5( నిజం చెపుతాం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్ సౌకర్యాన్ని గురించి విష ప్రచారం చేస్తున్న బి ఆర్ స్ , బీజేపీ పార్టీల వైఖరిని కండిస్తూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తూ ప్రయాణికులకు ఈ పథకం యెక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించిన

*సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేద మహిళలు,చిన్న చిన్న మహిళా వ్యాపారులు మరియు ఇతర వర్గాలకు లబ్ది చేకూరుతుందని ,

అలాగే ప్రజల్లో ఈ ఉచిత బస్ ప్రయాణం కు అద్భుతమైన స్పందన వస్తుందని తెలియజేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు వంద రోజుల్లో పూర్తిగా అన్ని పథకాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

కొంతమంది ప్రతిపక్ష నాయకులు సంక్షేమ పథకాలపై అవాకులు చివాక్కులు పేలుతున్నారని వారి మాటలు ప్రజలు నమ్మవద్దని ఆమె హితవు పలికారు.

ఆమె వెంట మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు