Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

6,9 తరగతుల సైనిక్ స్కూల్ ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ శశాంక.

తెలంగాణ స్టేట్ బ్యూరో శ్రీనివాస్ నాయక్ డిసెంబర్ 5.నిజం న్యూస్

కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించేందుకు 6,9 తరగతులలో చేరే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

ఈ మేరకు జిల్లా షెడ్యూలు కులంల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 9 తరగతులలో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

 

ఆన్లైన్ www.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు.

 

మిలటరీ ఓరియంటేడ్ ఎడ్యుకేషన్ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులను విద్యాపరంగా శారీరకంగా మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రమాణాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.

సైనిక స్కూల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి , 8వ తరగతి లలో చదువుతున్న బాల బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు.

ఆరో తరగతిలో ప్రవేశాల కొరకు తేదీ 31 3 2024 వరకు 10 నుండి 12 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అదేవిధంగా 9వ తరగతిలో ప్రవేశాలకు 31 3 20 24 వరకు 13 నుండి 15 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్ లేదా డిఫెన్స్ విద్యార్థులు 650 రూపాయలు చెల్లించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 500 రూపాయలు చెల్లించాలని తెలిపారు.

ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ వైద్య పరీక్షల ద్వారా ఉంటుందన్నారు దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకునేందుకుగాను ఈనెల 16వ తేదీ ఆఖరి తేదీగా తెలియజేశారు.